Wednesday, May 30, 2018

संवाद 3 - मन्दिर और वस्त्रधारण-एक संवाद

पिता--कहां जा रही हो?
बेटी--मंदिर।
पिता--ऐसे कपड़े पहन कर? इतनी मेकअप?
बेटी--हां क्या बुराई है इन कपड़ो में? मेकअप तो हमेशा करती हूँ।
पिता--अरे, मंदिर जाते समय विनीत वेष होकर जाना चाहिए। सादे कपड़ों में मंदिर जाकर अच्छा लगता है।
बेटी--क्या भगवान हमारे कपड़े देखते हैं या मन? क्या इन कपड़ों मे मेरी भक्तिभावना कम होजाएगी? मन साफ हो तो सब सही होगा। आप ही तो कहते हैं कि भगवान के सामने मन सबसे मुख्य वस्तु है।
पिता--हां, मैंने कहा था; मन के अनुसार शरीर का होना भी तो आवश्यक है। मंदिर में और लोग भी आते हैं। उन लोगों को शरीर ही दिखता है- तुम्हारा मन नहीं।
बेटी--आते होंगे..आने दो। नहीं दिखे, उनकी समस्या है। मुझे क्या? उन्हे अपने काम से काम रखना सीखना होगा।
पिता--अच्छा, काम की बात आ ही गई, तो मन्दिर में क्या करने जा रही हो तुम?
बेटी--दर्शन करने। मन्नत माँगने। ध्यान करने। शान्त होने- और क्यों?
पिता--तो उनमें इन कपड़ों का क्या काम? इतनी मेकअप करके ही शान्ति मिलती है क्या?
बेटी--पर मैं हमेशा इसी तरह रहती हूं। फैशनपरस्त।
पिता--नहीं, झूठ। तुम अपने दोस्त के घर जाते समय ऐसी नहीं जाती। पास के पार्क में, सुबह जागिंग करने, सब्जी लाने जाते समय, और शाम को माँ के साथ टहलने जाते समय, टेनिस खेलते समय- ऐसे नहीं जाती। अस्पताल में मरीज़ को देखते जाते समय क्या तुम फैशन करके जाती हो?
बेटी--मुझे ऐसे जाने की इच्छा हुई, सो जा रही हूँ।
पिता--क्यों हुई? मेकअप का क्या अर्थ होता है? क्यों करते हैं मेकअप, वह भी इतना समय व्यर्थ करके?
बेटी--अच्छा लगता है, आत्मविश्वास बढता है। वरना कोई हमारे ओर नहीं देखता है।
पिता--तो क्या तुम्हें मंदिर में सब तुम्हें देखें इस भावना से जा रही हो?
बेटी--आप बहस बहुत कर रहे हैं आज। कपड़े पहनना, मेकअफ करना हमारी अभिरुचि की पहचान है।
पिता--अभिरुचि की अभिव्यक्ति का स्थान मन्दिर नहीं होता है। भगवान के सामने इन सब ढोंगो की आवश्यकता है ही नहीं।
बेटी--अच्छा, तो कैसे जाना चाहिए? चन्दन का तिलक लगाकर, चोटी बाँधकर, बड़े बड़े बभूत की रेखाएं रखकर? इनसे क्या मिलता है? क्या यह सब केवल दिखावा नहीं है? ड्रामा नहीं है?
पिता--अच्छा, एक बात बताओ। तुम जब अपने मेडिकल कॉलेज में पढने जाती थी, तो एप्रन, स्टेथ क्यों पहनती थी? क्या वह ढोंग था? उसके बिना तुम पढ नहीं पाती?
बेटी--नहीं वह तो मेरा यूनिफार्म हुआ करता था, वह महाविद्यालय के अनुशासन का अन्तर्भाग था।
पिता--तुम्हारे भैया आर्मी में है तो वह हमेशा घर आने तक भी आर्मी के कपड़ों में ही रहता है। तो क्या वह ड्रामा करता है? क्या इन कपड़ों के बिना उसकी देशभक्ति नहीं है?
बेटी--नहीं, वह ढोंग ड्रामा नहीं है। वह उनका कर्तव्य निर्वहण की निशानी है। उन्हे उन कपड़ो में देखकर जब बच्चे सलाम मारते हैं- तो मुझे बड़ा गर्व होता है।
पिता--क्या पुलिस वाले पुलिस की विशेष कपड़े ढोंग के लिए पहनते हैं? उसके बिना लोगों की रक्षा नहीं कर सकते?
बेटी--नहीं, ऐसा नहीं है। वे कपड़े हमें बताने के लिए कि, वह पुलिस है। उन्हें देखकर हमारी हिम्मत बढ़ती है। यह व्यवस्था का अन्तर्भाग है।
पिता--बिल्कुल सही। फिर भगवान की सेवा के लिए, साधना के लिए, उसके अनुसार समुचित कपड़े पहनने में क्या बुराई है? लोगों को लगना चाहिए कि मन्दिर जारही हो, फैशन शो में नहीं।
बेटी--भगवान कोई व्यवस्था है क्या?
पिता--नहीं। पर मंदिर अवश्य व्यवस्था है। और उस व्यवस्था का सम्मान रखना हम सब का कर्तव्य है।
बेटी--यह बात मेरी कुछ समझ में नहीं आ रही है। मैं ने किसी का अन्याय नहीं किया है- ऐसे कपड़े पहनकर।
पिता--अच्छा, तुम पिछले सप्ताह किसी कॉकटेल पार्टी में गई थी। उस दिन तुम्हारा बड़ा अपमान हुआ था.. कि तुम्हे नए फैशन के हिसाब से कपड़े नहीं पहने। तो तुम घर आकर रोई थी। क्या उस दिन तुम ने किसी का अन्याय किया था? क्या वह तुम्हारे कपड़ों का प्रभाव नहीं था?
बेटी--सही है। था।
पिता--पार्टी में जाते हैं, तो पार्टी के लायक कपड़े पहनते हैं। शॉपिंग में जाते हैं, तो उसके लायक कपड़े पहनते हैं। ऑफिस में फॉर्मल वेयर पहनते हैं। ऑटोरिक्षा चलाने वाले से लेकर योगी सन्यासी तक हर व्यवस्था में एक वर्दी या विशिष्ट वस्त्र धारण को अपनाया जाता है। भतीजा स्कूल जाते समय बेज, टाई, शू सब पहनकर क्यो जाता है? तुम्हारी दीदी कंपनी में काम करते जाते समय अपना ID कार्ड वगैरह सब लेकर जाती है, क्यों??
बेटी--वह उनका प्रोफाइल के अंतर्गत है। उसके बिना वह लोग दीदी को अंदर नहीं आने देते। पर मंदिर में मुझे इन कपड़ो में कौन रोकेगा?
पिता-- कितना अच्छा होता यदि रोकदेते..। पर ऐसा नहीं है। कोई रोकता टोकता नहीं है। हमें स्वयं कुछ चीजें समझ लेनी चाहिए। मंदिर शांत होकर, प्रसन्नचित्त से अपने मन की ताप व अंदर की अशांति को निकाल फेंकने के लिए लोग जाना चाहते हैं। वहां पर वे प्रार्थना करते हैं, मौन रहकर भगवान की ध्यान इत्यादि, यथाशक्ति स्तोत्र आदि करते हैं। हमारे बाहरी अहंकार एवं अन्य चित्त विकारों को बाहर ही छोड़कर जाना उचित होगा। हमें मंदिर जाते समय स्वयं के रूप एवं वस्त्र धारण अटकना नहीं चाहिए।
बेटी--अच्छा, बात तो सही है।
पिता--पहले सब लोग इस बात को स्वयं ही समझ लेते थे। स्त्रियां साड़ी में सिर ढककर, और पुरुष धोती कुर्ते में जाते थे। उन्हें मंदिर जाते समय अपने रूप किस प्रकार का रखना है, यह समझ अपने आप हुआ करता था। आजकल के युवा पीढ़ी में यह पूरी तरह खत्म हो गई है। वह हर जगह अपने आप वस्त्रधारण का पूरा पूरा खयाल स्वयं रखा करते हैं, जैसे कालेज, फंक्शन, होटल इत्यादि जाते समय। उसी प्रकार यदि वे मंदिर जाते समय भी करते, तो अन्य को आपत्ति नहीं होती।
बेटी--पर आजतक मुझसे किसी ने कहा ही नहीं कुछ।
पिता--कोई तुमसे कहेगा नहीं बेटी। यह आधुनिक पार्टी नहीं है- कि कोई मुँह पर कुछ भी कह दें। पर अंदर ही अंदर तुम्हें कोसेंगे कि उनका ध्यान बांटने वाले कपड़े पहन कर आ रही हो। कितनी लज्जाहीन लड़की है। इसके घर वालों ने इसे कुछ नहीं समझाया। मैं ने अन्यत्र जाते समय तुम्हें कभी नहीं रोका। पर कम से कम मंदिर का सम्मान रखना तुम्हारा कर्तव्य है।
बेटी--ठीक है पापा। मैं आपकी बात से सहमत हूं। मैं सादे कपड़ों में ही मंदिर जाऊंगी।

--उषाराणी सङ्का
(18.05.2018)

సంవాదం 3 - మందిరం, వస్త్రధారణం -ఒక సంవాదం-

తండ్రి-- ఎక్కడికి వెళ్తున్నావు?
కూతురు-- గుడికి.
తండ్రి-- ఇటువంటి బట్టలు కట్టుకునా? ఇంత మేక్అప్ ఆ?
కూతురు-- ఆఁ, ఏమైంది ఈ బట్టలకు? మేక్అప్ నేను రోజూ చేసుకుంటాను కదా.
తండ్రి-- అరే, గుడికి వెళ్ళే సమయంలో వినయంగా వేషం ధరించి వెళ్ళాలమ్మా. సాదా బట్టలలో గుడికి పోతే బాగనిపిస్తుంది.
కూతురు-- భగవంతుడు మన బట్టలు చూస్తాడా లేక మనస్సా? ఈ బట్టలలో నా భక్తిభావన తగ్గిపోతుందా? మనస్సు నిర్మలంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. మీరే కదా అంటారు, భగవంతుడి ఎదుట మనస్సే అననింటికన్నా ముఖ్య వస్తువు అని.
తండ్రి-- ఔను, నేనే అంటాను; మనస్సుకు అనుగుణంగా శరీరం ఉండటం కూడా ఆవశ్యకమే కదా. గుడికి ఇతర జనాలు కూడా వస్తుంటారు. వారికి శరీరమే కనిపిస్తుంది- నీ మనస్సు కాదు.
కూతురు-- వస్తే వచ్చారు.. రానివ్వండి. కనిపించకపోతే వాళ్ళ ఖర్మ. నాకేంటి? వారు తమ పని తాము చేసుకోవటం నేర్చుకోవాలి.
తండ్రి-- ఔనా, పని సందర్భం రానే వచ్చింది కదా, అయితే మందిరావికి ఏం చేయటానికి పోతున్నావుటా నువ్వు?
కూతురు-- దర్శనానికి. కోరిక కోరడానికి. ధ్యానం చేయటానికి. మనసు శాంతం చేసుకోవటానికి- ఇంకా దేనికి?
తండ్రి-- అయితే వాటిలో ఈ బట్టల పనేంటి? ఇంత మేక్అప్ చేసుకుంటే కానీ శాన్తి దొరకదా?
కూతురు-- కానీ నేను ఎప్పుడూ ఇట్లాంటి బట్టలే ధరిస్తాను- ఫ్యాషన్ గా.
తండ్రి-- లేదే, అబద్ధం. నువ్వు నీ నేస్తాల ఇళ్ళకు పోయే సమయంలో ఇట్ల పోవు. దగ్గరలో పార్కుకు, ఉదయం జాగింగుకు, కూరలు తేవటానికి, సాయింత్రం అమ్మ తో కలిసి తిరగటానికి పోయే వేళ, టెన్నిస్ ఆడేవేళ- ఇట్ల వెళ్ళవే. వైద్యాలయం లో రోగులను చూడటానికి వెళ్ళే సమయంలో నీవింత ఫ్యాషన్ చేసుకుని పోతావా?
కూతురు-- నాకు ఇట్ల పోవాలని అనిపించింది, అందుకు పోతున్నాను.
తండ్రి-- ఎందుకు అనిపించింది? మేక్అప్ కి అర్థం ఏంటి? ఎందుకు చేసుకుంటారు మేక్అప్, అది కూడా ఇంత సమయం వ్యర్థం చేసుకుని?
కూతురు-- బాగనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ఎవ్వరూ మన వంక చూడరు.
తండ్రి-- అయితే గుడిలో నిన్ను అందరూ గుడ్లప్పగించి చూడాలనే భావనతో పోతున్నావా?
కూతురు-- మీరు ఈరోజు ఎందుకో ఎక్కువగా వాదిస్తున్నారు నాన్నా. బట్టలు వేసుకోవటం, మేక్అప్ చేసుకోవటం మన  అభిరుచికి తార్కాణం.
తండ్రి-- అభిరుచిని అభివ్యక్తం చేసుకునే స్థానం మందిరం కాదు కదమ్మా. భగవంతుడి ఎదుట ఈ వేషాలన్నీ వేసే ఆవశ్యకతేం లేదే.
కూతురు-- అచ్ఛా, అయితే ఎట్లా పోవాలిట? చందనం తిలకం పెట్టుకుని, జడ కట్టుకుని, పెద్ద పెద్ద విభూతి రేఖలు రాచుకునా? వీటితో ఏం లభిస్తుంది? ఇదంతా కేవలం బయటకు డాబు కాదా? డ్రామా కాదా?
తండ్రి-- ఓహ్, సరే. ఒక మాట చెప్పు. నీవు నీ మెడికల్ కాలేజికి చదవటానికి పోయేదానివి.. అప్పుడు ఏప్రన్, స్టెథస్కోప్ ఎందుకు వేసుకునేదానివి? అదంతా డాబా? అది లేకుండా నీవు చదువుకోలేకపోయావా?
కూతురు-- లేదు, అదంతా నా యూనిఫార్మ్ గ ఉండేది, అది మహావిద్యాలయం అనుశాసనంలో అన్తర్భాగం కదా.
తండ్రి-- నీ అన్న ఆర్మీలో ఉన్నాడు. వాడు ఎప్పుడు ఇంటికి వచ్చేదాకా కూడా ఆర్మీ బట్టలలోనే ఉంటాడు. అయితే డ్రామా చేస్తున్నాడన్నమాట? ఈ బట్టలు లేకుండా వాడికి దేశభక్తి లేదనా?
కూతురు-- అట్లా కాదు, అది డాబు, డ్రామా కాదు. అది వారి కర్తవ్య నిర్వహణానికి సంకేతం. వారిని ఆ బట్టలలో చూసి పిల్లలు సెల్యూట్ చేస్తే- నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
తండ్రి-- పోలీసులు పోలీసు వేషం కోసం విశేష బట్టలు ధరించేది డ్రామా కోసమా? అది లేకుండా వారు జనాలను రక్షించలేరా?
కూతురు-- అట్లా ఏం కాదు. ఆ బట్టలవల్ల మనకు వారు పోలీసులని తెలుస్తుంది. వారిని చూసి మన ధైర్యం పెరుగుతుంది. ఇది ఆ వ్యవస్థలో అంతర్భాగం కదా.
తండ్రి-- నిజం.. మరి భగవంతుడి సేవకోసం, సాధనకోసం, దాని ప్రకారం సముచితమైన బట్టలు వేసుకుని పోవటంలో ఏంటి తప్పు? జనాలకు అనిపించాలా లేదా, మనం మందిరానికి పోతున్నామని, ఫ్యాషన్ షో లోకి కాదు- అని అనిపించాలా లేదా?
కూతురు-- భగవంతుడు కూడా ఏదైనా వ్యవస్థా?
తండ్రి-- లేదు. కానీ గుడి అయితే ఒక వ్యవస్థే. ఆ వ్యవస్థను గౌరవించటం మనందరి కర్తవ్యం.
కూతురు-- ఈ మాట నాకు అస్సలు అర్థం కావటంలేదు. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదే- ఇట్టి బట్టలు ధరించి.
తండ్రి-- అచ్ఛా, నీవు క్రితం వారం ఏదో కాక్ టేల్ పార్టీకి పోయావు. ఆ రోజు నీకేదో గొప్ప అవమానం అయింది- నీకసలు ఫ్యాషన్ ప్రకారం బట్టలు వేసుకోవటం రాదని ఎద్దేవా చేశారక్కడ. నువ్వు ఇంటికి వచ్చి ఒకటే ఏడ్చావు. ఆరోజు నువ్వు ఎవరికైనా అన్యాయం చేశావా? అది నీ బట్టల ప్రభావం కాదా?
కూతురు-- నిజమే. వాటి ప్రభావమే.
తండ్రి-- పార్టీకి పోతే పార్టీ కి అనుగుణమైన బట్టలు వేసుకుంటారు. షాపింగుకు పోతే అక్కడికి అనుకూలమైనవి ధరిస్తారు. ఆఫీసుకు పోతే ఫార్మల్ వేర్ కట్టుకుంటారు. ఆటోరిక్షా నడిపేవాడి నుంచి యోగులు సన్యాసుల దాకా ప్రతీ వ్యవస్థలో ఒక నిర్దిష్టమైన విశిష్ట వస్త్రధారణ ఉంటుంది. నీ అన్న కొడుకు స్కూలుకు పోయే సమయంలో బాడ్జి, టై, బూట్లు అన్నీ వేసుకుని ఎందుకు పోతున్నాడు? నీ అక్క కంపెనీ లో పని చేయటానికి పోయేవేళ తన ఐడీ కార్డు వగైరాలు అన్నీ తీసుకుని పోతుందే, ఎందుకుటా??
కూతురు-- అది వారి ప్రోఫైల్ లో అంతర్గతమైన విషయం. అవి లేకుండా అక్కను లోపలకు రానివ్వరెవ్వరూ. కానీ గుడిలో ఈ బట్టల వేసుకున్నందుకు ఎవరు ఆపేది?
తండ్రి-- ఎంత బాగుండేదో ఆపినట్లైతే... కానీ అట్లా లేదు. ఎవ్వరూ ఆపరు, ఏమీ అనరు. మనం స్వయంగా కొన్ని అవగతం చేసుకోవాలి.. గుడి శాంతం కావటానికి, ప్రసన్నచిత్తంతో మన మనస్సులో తాపం, లోపలి అశాంతిని బయటకు పంపటానికి  జనాలు పోదామనుకునే చోటు కదా. అక్కడ వారు ప్రార్థన చేస్తారు, మౌనంగా ఉండి యథాశక్తి భగవంతుని ధ్యానాదులతో, స్తోత్రాదులతో కొలుస్తారు. మన బయటి అహంకారం, ఇతర చిత్త వికారాలను బయట వదిలి లోపలకు పోవటం సముచితం అవుతుంది. మనం గుడికి పోయేవేళ మన రూపం, మన వస్త్ర ధారణ ఎవ్వరికీ వికారం కలిగించకూడదు.
కూతురు-- ఔను, ఈ మాట నిజమే.
తండ్రి-- పూర్వం అందరూ ఈ విషయం స్వయంగా అవగతం చేసుకుని మసిలేవారు. స్త్రీలు చీరలో కొంగు నిండా కప్పుకుని, పురుషులు పంచ, లాల్చీ తొడుక్కుని పోయేవారు. వారికి గుడికి పోయేవేళ తమ రూపం ఎట్లా ఉండాలనేది, చక్కగా తెలిసుండేది. ఇవాళ రేపు యువత లో ఇది పూర్తిగా నశించింది. వారు ప్రతీ చోటా తమ వస్త్రధారణ గురించి పూర్తిగా జాగ్రత్త వహిస్తారు- కాలేజు, ఫంక్షనులు, హోటళ్ళు ఇత్యాదులకు పోయేవేళల్లో. అదే విధంగా గుడికి పోయే వేళ కూడా ఉంటే, ఇతరులకు అభ్యంతరం ఉండదు కదా.
కూతురు-- కానీ ఈనాటి వరకు నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదే.
తండ్రి-- ఎవ్వరూ ఏమీ అనరమ్మా. ఇది ఆధునిక పార్టీ కాదు- ఎవరైనా ఎవరినైనా మొహం పట్టుకుని ఏది పడితే అది అనేయటానికి.. కానీ అందరూ లోలోపలే నిన్ను తిట్టుకుంటారు- వారి ధ్యాస మళ్ళించే విధంగా ఉన్న బట్టలు వేసుకుని వచ్చిందని, ఎంత లజ్జలేని పిల్ల అని, దీని ఇంట్లో ఎవ్వరూ మంచి చెప్పలేదా- అని. నేను వేరే చోట్లకు పోయేవేళ నిన్ను ఎప్పుడూ ఆపలేదే. కానీ కనీసం గుడి మర్యాదను కాపాడటం నీ కర్తవ్యం కదా.
కూతురు-- సరే నాన్నా. నేను మీ మాటను ఒప్పుకుంటున్నాను. నేను సాదా బట్టలలోనే గుడికి పోతాను.
-సంకా ఉషారాణి