తండ్రి-- ఎక్కడికి వెళ్తున్నావు?
కూతురు-- గుడికి.
తండ్రి-- ఇటువంటి బట్టలు కట్టుకునా?
ఇంత
మేక్అప్ ఆ?
కూతురు-- ఆఁ, ఏమైంది ఈ బట్టలకు? మేక్అప్ నేను రోజూ చేసుకుంటాను కదా.
తండ్రి-- అరే, గుడికి వెళ్ళే సమయంలో
వినయంగా వేషం ధరించి వెళ్ళాలమ్మా. సాదా బట్టలలో గుడికి పోతే బాగనిపిస్తుంది.
కూతురు-- భగవంతుడు మన బట్టలు చూస్తాడా లేక మనస్సా? ఈ బట్టలలో నా భక్తిభావన తగ్గిపోతుందా? మనస్సు నిర్మలంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. మీరే కదా
అంటారు, భగవంతుడి ఎదుట మనస్సే
అననింటికన్నా ముఖ్య వస్తువు అని.
తండ్రి-- ఔను, నేనే అంటాను; మనస్సుకు అనుగుణంగా శరీరం ఉండటం కూడా ఆవశ్యకమే కదా. గుడికి
ఇతర జనాలు కూడా వస్తుంటారు. వారికి శరీరమే కనిపిస్తుంది- నీ మనస్సు కాదు.
కూతురు-- వస్తే వచ్చారు.. రానివ్వండి. కనిపించకపోతే వాళ్ళ ఖర్మ. నాకేంటి? వారు తమ పని తాము చేసుకోవటం నేర్చుకోవాలి.
తండ్రి-- ఔనా, పని సందర్భం రానే
వచ్చింది కదా, అయితే మందిరావికి ఏం చేయటానికి
పోతున్నావుటా నువ్వు?
కూతురు-- దర్శనానికి. కోరిక కోరడానికి. ధ్యానం చేయటానికి. మనసు శాంతం
చేసుకోవటానికి- ఇంకా దేనికి?
తండ్రి-- అయితే వాటిలో ఈ బట్టల పనేంటి?
ఇంత
మేక్అప్ చేసుకుంటే కానీ శాన్తి దొరకదా?
కూతురు-- కానీ నేను ఎప్పుడూ ఇట్లాంటి బట్టలే ధరిస్తాను- ఫ్యాషన్ గా.
తండ్రి-- లేదే, అబద్ధం. నువ్వు నీ
నేస్తాల ఇళ్ళకు పోయే సమయంలో ఇట్ల పోవు. దగ్గరలో పార్కుకు, ఉదయం జాగింగుకు, కూరలు తేవటానికి, సాయింత్రం అమ్మ తో కలిసి తిరగటానికి పోయే వేళ, టెన్నిస్ ఆడేవేళ- ఇట్ల వెళ్ళవే. వైద్యాలయం లో రోగులను
చూడటానికి వెళ్ళే సమయంలో నీవింత ఫ్యాషన్ చేసుకుని పోతావా?
కూతురు-- నాకు ఇట్ల పోవాలని అనిపించింది,
అందుకు
పోతున్నాను.
తండ్రి-- ఎందుకు అనిపించింది? మేక్అప్ కి అర్థం ఏంటి? ఎందుకు చేసుకుంటారు మేక్అప్, అది కూడా ఇంత సమయం వ్యర్థం చేసుకుని?
కూతురు-- బాగనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం
పెరుగుతుంది. లేదంటే ఎవ్వరూ మన వంక చూడరు.
తండ్రి-- అయితే గుడిలో నిన్ను అందరూ గుడ్లప్పగించి చూడాలనే భావనతో పోతున్నావా?
కూతురు-- మీరు ఈరోజు ఎందుకో ఎక్కువగా వాదిస్తున్నారు నాన్నా. బట్టలు వేసుకోవటం, మేక్అప్ చేసుకోవటం మన
అభిరుచికి తార్కాణం.
తండ్రి-- అభిరుచిని అభివ్యక్తం చేసుకునే స్థానం మందిరం కాదు కదమ్మా. భగవంతుడి
ఎదుట ఈ వేషాలన్నీ వేసే ఆవశ్యకతేం లేదే.
కూతురు-- అచ్ఛా, అయితే ఎట్లా పోవాలిట? చందనం తిలకం పెట్టుకుని, జడ కట్టుకుని, పెద్ద పెద్ద విభూతి
రేఖలు రాచుకునా? వీటితో ఏం లభిస్తుంది? ఇదంతా కేవలం బయటకు డాబు కాదా? డ్రామా కాదా?
తండ్రి-- ఓహ్, సరే. ఒక మాట చెప్పు.
నీవు నీ మెడికల్ కాలేజికి చదవటానికి పోయేదానివి.. అప్పుడు ఏప్రన్, స్టెథస్కోప్ ఎందుకు వేసుకునేదానివి? అదంతా డాబా? అది లేకుండా నీవు
చదువుకోలేకపోయావా?
కూతురు-- లేదు, అదంతా నా యూనిఫార్మ్ గ
ఉండేది, అది మహావిద్యాలయం అనుశాసనంలో
అన్తర్భాగం కదా.
తండ్రి-- నీ అన్న ఆర్మీలో ఉన్నాడు. వాడు ఎప్పుడు ఇంటికి వచ్చేదాకా కూడా ఆర్మీ
బట్టలలోనే ఉంటాడు. అయితే డ్రామా చేస్తున్నాడన్నమాట? ఈ బట్టలు లేకుండా వాడికి దేశభక్తి లేదనా?
కూతురు-- అట్లా కాదు, అది డాబు, డ్రామా కాదు. అది వారి కర్తవ్య నిర్వహణానికి సంకేతం. వారిని
ఆ బట్టలలో చూసి పిల్లలు సెల్యూట్ చేస్తే- నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది.
తండ్రి-- పోలీసులు పోలీసు వేషం కోసం విశేష బట్టలు ధరించేది డ్రామా కోసమా? అది లేకుండా వారు జనాలను రక్షించలేరా?
కూతురు-- అట్లా ఏం కాదు. ఆ బట్టలవల్ల మనకు వారు పోలీసులని తెలుస్తుంది. వారిని
చూసి మన ధైర్యం పెరుగుతుంది. ఇది ఆ వ్యవస్థలో అంతర్భాగం కదా.
తండ్రి-- నిజం.. మరి భగవంతుడి సేవకోసం,
సాధనకోసం, దాని ప్రకారం సముచితమైన బట్టలు వేసుకుని పోవటంలో ఏంటి తప్పు? జనాలకు అనిపించాలా లేదా, మనం మందిరానికి పోతున్నామని, ఫ్యాషన్ షో లోకి కాదు-
అని అనిపించాలా లేదా?
కూతురు-- భగవంతుడు కూడా ఏదైనా వ్యవస్థా?
తండ్రి-- లేదు. కానీ గుడి అయితే ఒక వ్యవస్థే. ఆ వ్యవస్థను గౌరవించటం మనందరి
కర్తవ్యం.
కూతురు-- ఈ మాట నాకు అస్సలు అర్థం కావటంలేదు. నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదే-
ఇట్టి బట్టలు ధరించి.
తండ్రి-- అచ్ఛా, నీవు క్రితం వారం ఏదో
కాక్ టేల్ పార్టీకి పోయావు. ఆ రోజు నీకేదో గొప్ప అవమానం అయింది- నీకసలు ఫ్యాషన్
ప్రకారం బట్టలు వేసుకోవటం రాదని ఎద్దేవా చేశారక్కడ. నువ్వు ఇంటికి వచ్చి ఒకటే
ఏడ్చావు. ఆరోజు నువ్వు ఎవరికైనా అన్యాయం చేశావా? అది నీ బట్టల ప్రభావం కాదా?
కూతురు-- నిజమే. వాటి ప్రభావమే.
తండ్రి-- పార్టీకి పోతే పార్టీ కి అనుగుణమైన బట్టలు వేసుకుంటారు. షాపింగుకు
పోతే అక్కడికి అనుకూలమైనవి ధరిస్తారు. ఆఫీసుకు పోతే ఫార్మల్ వేర్ కట్టుకుంటారు.
ఆటోరిక్షా నడిపేవాడి నుంచి యోగులు సన్యాసుల దాకా ప్రతీ వ్యవస్థలో ఒక నిర్దిష్టమైన
విశిష్ట వస్త్రధారణ ఉంటుంది. నీ అన్న కొడుకు స్కూలుకు పోయే సమయంలో బాడ్జి, టై, బూట్లు అన్నీ వేసుకుని
ఎందుకు పోతున్నాడు? నీ అక్క కంపెనీ లో పని
చేయటానికి పోయేవేళ తన ఐడీ కార్డు వగైరాలు అన్నీ తీసుకుని పోతుందే, ఎందుకుటా??
కూతురు-- అది వారి ప్రోఫైల్ లో అంతర్గతమైన విషయం. అవి లేకుండా అక్కను లోపలకు
రానివ్వరెవ్వరూ. కానీ గుడిలో ఈ బట్టల వేసుకున్నందుకు ఎవరు ఆపేది?
తండ్రి-- ఎంత బాగుండేదో ఆపినట్లైతే... కానీ అట్లా లేదు. ఎవ్వరూ ఆపరు, ఏమీ అనరు. మనం స్వయంగా కొన్ని అవగతం చేసుకోవాలి.. గుడి
శాంతం కావటానికి, ప్రసన్నచిత్తంతో మన మనస్సులో
తాపం, లోపలి అశాంతిని బయటకు పంపటానికి జనాలు పోదామనుకునే చోటు కదా. అక్కడ వారు
ప్రార్థన చేస్తారు, మౌనంగా ఉండి యథాశక్తి
భగవంతుని ధ్యానాదులతో, స్తోత్రాదులతో
కొలుస్తారు. మన బయటి అహంకారం, ఇతర చిత్త వికారాలను
బయట వదిలి లోపలకు పోవటం సముచితం అవుతుంది. మనం గుడికి పోయేవేళ మన రూపం, మన వస్త్ర ధారణ ఎవ్వరికీ వికారం కలిగించకూడదు.
కూతురు-- ఔను, ఈ మాట నిజమే.
తండ్రి-- పూర్వం అందరూ ఈ విషయం స్వయంగా అవగతం చేసుకుని మసిలేవారు. స్త్రీలు
చీరలో కొంగు నిండా కప్పుకుని, పురుషులు పంచ, లాల్చీ తొడుక్కుని పోయేవారు. వారికి గుడికి పోయేవేళ తమ రూపం
ఎట్లా ఉండాలనేది, చక్కగా తెలిసుండేది. ఇవాళ రేపు
యువత లో ఇది పూర్తిగా నశించింది. వారు ప్రతీ చోటా తమ వస్త్రధారణ గురించి పూర్తిగా
జాగ్రత్త వహిస్తారు- కాలేజు, ఫంక్షనులు, హోటళ్ళు ఇత్యాదులకు పోయేవేళల్లో. అదే విధంగా గుడికి పోయే
వేళ కూడా ఉంటే, ఇతరులకు అభ్యంతరం ఉండదు కదా.
కూతురు-- కానీ ఈనాటి వరకు నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదే.
తండ్రి-- ఎవ్వరూ ఏమీ అనరమ్మా. ఇది ఆధునిక పార్టీ కాదు- ఎవరైనా ఎవరినైనా మొహం
పట్టుకుని ఏది పడితే అది అనేయటానికి.. కానీ అందరూ లోలోపలే నిన్ను తిట్టుకుంటారు-
వారి ధ్యాస మళ్ళించే విధంగా ఉన్న బట్టలు వేసుకుని వచ్చిందని, ఎంత లజ్జలేని పిల్ల అని, దీని ఇంట్లో ఎవ్వరూ మంచి చెప్పలేదా- అని. నేను వేరే చోట్లకు పోయేవేళ నిన్ను
ఎప్పుడూ ఆపలేదే. కానీ కనీసం గుడి మర్యాదను కాపాడటం నీ కర్తవ్యం కదా.
కూతురు-- సరే నాన్నా. నేను మీ మాటను ఒప్పుకుంటున్నాను. నేను సాదా బట్టలలోనే
గుడికి పోతాను.
-సంకా ఉషారాణి
No comments:
Post a Comment