ఈ సఁలాపాల సరిగమలు, సుగంధాల గురించి కొంత--
ఎప్పుడెప్పటినుంచో కలలు కన్నవి.. అప్పుడప్పుడూ చేస్తున్నవి.. ఎప్పటికైనా చేయావలసినవెన్నో..
చేయగలిగినంత, చేతనైనంత.. సాగినంత.. ఇక్కడ ఇమడ్చటానికి ప్రయత్నం.. రకరకాలు.. భావాలు,
ఉద్వేగాలు, సంభాషణల మాధ్యమంలో ఒదిగి వచ్చినవాటిని అట్లాగే పొందుపరిచేశాను..
హిందీలో, తెలుగులో ముఖ్యంగా..
లేఖని కదిలింది కదా అని
వ్రాసేయటం, భావం తట్టింది కదా అని పొంగించేయటం చిన్నతనం నుంచి ఓ దురలవాటు. ఇప్పటికీ
పోవటం లేదు.. వ్రాసనివి ఫైళ్ళలో మగ్గేకన్నా జనాలను చేరటం ముఖ్యం కదా.. ఎవరి హృదయ
నందనం తెరిచి ఉంటే వారి కన్నుల కవాటం తట్టి లోపలకు చొరబడాలని వీటి ఆకాంక్షకోసం ఈ
నెట్టు పెట్టెలో వేసి ఉంచుతున్నాను..
ఎంతో కష్టపడితే చిన్నతనంనుంచీ
చదువు నేరుస్తారం. చదువుకన్నా సంస్కారం ముఖ్యం. మన దేశం విశిష్టమైనది. ఇక్కడి సంస్కృతి
గొప్పతనం తెలుసుకోవాలంటే కూడా ఒక జన్మ చాలదు. అర్థం చేసుకోవటానికి తపస్సు చేసి
ఉండాలి. అక్షరాల మాధ్యమంతో ఆ సాహసం చేయబూనటం భువిపై నిలిచి ఆకాశాన్ని అరచేతుల్లో
పట్టుకోచూడటమే. పట్టుకున్నామా అంటే పట్టుకున్నట్టే, లేదా అంటే లేదు. ఇవి చదివి లేశమైనా
ఒకరి ఆలోచనలో మార్పు వస్తే నా ప్రయత్నం సఫలమైనట్టే.. పెద్దల వల్ల విన్నదే, వారి
అనఉగ్రహవర్షాన తడిసిన ఫలితంగా ఈ మనోభూమిలో చిగురించినవే ఈ సన్నని సద్భావాల మొక్కలు..
ఈ పూల సుగంధం మరిన్ని విత్తనాలను పెట్టించగలిగితే జన్మ ధన్యమే..
నమో నమః
No comments:
Post a Comment